పవన్-రానా పోరాటానికి.. టైటిల్ వేటలో త్రివిక్రమ్!

పవన్-రానా పోరాటానికి.. టైటిల్ వేటలో త్రివిక్రమ్!

మలయాళం సూపర్ హిట్ సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్ ను తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటుగా, పర్యవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. ఈ సినిమాకి ‘బిల్లా-రంగా’ టైటిల్ పరిశీలనలో ఉన్నప్పటికీ.. ఆ టైటిల్ తో చిత్ర యూనిట్ సంతృప్తి చెందడం లేదని తెలుస్తోంది. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాఫ్ట్ గా రన్ అవుతూనే.. రానా-పవన్ లు తలపడే మాస్ సన్నివేశాలు కూడా చాలానే ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని టైటిల్ రూపొందించే పనిలో పడ్డాడట త్రివిక్రమ్. పవర్ ఫుల్ టైటిల్ తో సాఫ్ట్ కోణం తలపించేలా త్రివిక్రమ్ మార్క్ టైటిల్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.