మాటల మాంత్రికుడి భారీ ప్లాన్ .. మెగా ఫ్యాన్స్ కు పండగే

మాటల మాంత్రికుడి భారీ ప్లాన్ .. మెగా ఫ్యాన్స్ కు పండగే

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఫస్ట్ ఉండే డైరెక్టర్ త్రివిక్రమ్ . ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు తన నెక్స్ట్ సినిమాను కూడా అనౌన్స్ చేసాడు. ఎన్టీఆర్ తో తన నెక్స్ట్ సినిమా ఉంటుందని త్రివిక్రమ్ అనౌన్స్ చేసాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలనీ చూస్తున్నాడు. పవన్ కు అత్తారింటికి దారేది సినిమాలాంటి భారీ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్. ఆతర్వాత అజ్ఞాతవాసి లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి భారీ హిట్ ఇవ్వాలని కసితో ఉన్నాడు త్రివిక్రమ్. అయితే భారీ బడ్జెట్ తో పవన్ సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నాడు గురూజీ. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా కనిపించనున్నారని ఫిలింనగర్ లో టాక్. చిరంజీవిని పవన్ కళ్యాణ్ సినిమాలో గెస్ట్ రోల్ లో చూపించాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఇందుకోసం మెగాస్టార్ పర్మిషన్ కూడా తీసుకున్నాడట. ఓ వైపు రామ్ తో చేయనున్న సినిమాకి స్ర్కిప్ట్ వర్క్ చేస్తూనే త్రివిక్రమ్ మరో వైపు చిరు - పవన్ లతో చేయనున్న సినిమా కోసం కథ రెడీ చేస్తున్నారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. పవన్ సినిమాలో చిరు కనిపిస్తే  నిజంగా మెగా ఫ్యాన్స్ కు పండగే..