త్రివిక్రమ్ గట్టి కథే రాశాడన్నమాట !

త్రివిక్రమ్ గట్టి కథే రాశాడన్నమాట !

'అజ్ఞాతవాసి' పరాజయంతో త్రివిక్రమ్ మీద విమర్శలు వెల్లువెత్తాయి.  ఆ కలం పదును తగ్గిందని అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.  అందుకే ఈసారి పెన్ పవర్ చూపడానికి పక్క కథను రాసుకున్నట్టు కనిపిస్తున్నాడు త్రివిక్రమ్.  ఏళ్లుగా ర్జున్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ నటీనటులు టబు, నానా పటేకర్ లాంటి వాళ్ళను సంప్రదిస్తున్నాడు. 

నానా పటేకర్ ఏ స్థాయి నటుడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.  తన పాత్ర బలంగా ఉంటే తప్ప సినిమా ఒప్పుకోరు ఆయన.  అలాంటి నటుడి కోసం ట్రై చేస్తున్నాడంటే త్రివిక్రమ్ ఖచ్చితంగా మంచి కథే రాసుంటాడని అనిపిస్తోంది.  మరి ఆ కథ ఎంత గట్టిదో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.