భారీ క్యాస్టింగ్ ను ప్లాన్ చేసిన త్రివిక్రమ్

భారీ క్యాస్టింగ్ ను ప్లాన్ చేసిన త్రివిక్రమ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది.  సెంటిమెంట్ తో పాటు కావాల్సినంత వినోదం కూడా సినిమాల్లో దొరుకుతుంది.  అందుకే త్రివిక్రమ్ సినిమాలకు టాలీవుడ్ లో ప్రత్యేక ఆదరణ ఎక్కువగా ఉంటుంది.  ప్రస్తుతం త్రివిక్రమ్... అల్లు అర్జున్ తో ఓ సినిమా చేస్తున్నాడు.  ఏప్రిల్ 24 వ తేదీ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.  

ఇందులో ఓ ప్రత్యేకత ఉంది.  సినిమా కోసం ఏకంగా పాత, కొత్తతరం హీరోలు కలిపి అరడజను మందికి పైగా నటిస్తున్నారట.  పాతతరం హీరోలైన రాజేంద్రప్రసాద్, సత్యరాజ్, బ్రహ్మాజీ, నవదీప్, సునీల్ తో పాటు అక్కినేని హీరో సుశాంత్ ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్నారు.  సుశాంత్ ను ఏ పాత్రకోసం తీసుకున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.