రామారావుగారికి సమానమైన వ్యక్తి ఎన్టీఆర్ - త్రివిక్రమ్

రామారావుగారికి సమానమైన వ్యక్తి ఎన్టీఆర్ - త్రివిక్రమ్

'అరవింద సమేత' ఘన విజయం సాధించిన సందర్బానాగ్ చిత్ర యూనిట్ ఈరోజు సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.  ఈ వేడుకలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ను ఆకాశానికెత్తేశాడు.  ప్రతి తరంలోను ఒక బలమైన నటుడు ఉంటాడన్న త్రివిక్రమ్ ఈ తరానికి ఆ నటుడు ఎన్టీఆర్ అని అన్నారు. 

పెద్దాయన రామారవిదారికి సమానమైన సత్తా ఎన్టీఆర్లో ఉందని, ఆ క్రమశిక్షణ, వయసు, ప్రతిభ, నిజాయితీ అన్నీ దేవుడు తారక్ కు ప్రసాదించాడని చెప్పుకొచ్చారు.  ఈ సినిమాను ఇంత తక్కువ సమయంలో పూర్తి  చేయడానికి కారణం ఎన్టీఆర్ అని, బోలెడంత దుఃఖాన్ని మనసులో దాచుకుని, మొదటి నుండి సినిమాను నమ్మి పనిచేశారని కొనియాడారు.