బన్నీకి షాకిచ్చిన త్రివిక్రమ్.... 

బన్నీకి షాకిచ్చిన త్రివిక్రమ్.... 

అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో.  ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే.  ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే మూడు సాంగ్స్ రిలీజ్ చేశారు.  బుట్టబొమ్మ సాంగ్ టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోంది.  

ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  అదే రన్ టైమ్.  సినిమా రన్ టైమ్ విషయంలో బన్నీ ఓ క్లారిటీతో ఉన్నారు.  అయితే, త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాకు ఫైనల్ గా 3 గంటల 5 నిమిషాల సమయాన్ని సెట్ చేశారని తెలుస్తోంది.  సినిమా కోసం కామెడీ, యాక్షన్ సీస్ తో కలిపి మొత్తం మూడు గంటలు ఉన్నట్టు తెలుస్తోంది.  కానీ, బన్నిమాత్రం ఫైనల్ రన్ టైమ్ రెండు గంటల 25 నిముషాలు ఉంటె చాలని అంటున్నారు.  అంటే కనీసం 30 నిముషాలు తగ్గించాలి.  త్రివిక్రమ్ మూడు గంటలు ఉంటేనే సినిమా బాగుంటుందని అంటున్నారట.  ఫైనల్ నిడివి విషయంలో బన్నీ.. త్రివిక్రమ్ ల మధ్య చర్చలు నడుస్తున్నాయని సమాచారం. ఫైనల్ చేసిన తరువాత థమన్ రీ రికార్డింగ్ స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.