డౌట్స్ క్లియర్ చేయండి త్రివిక్రమ్ !

డౌట్స్ క్లియర్ చేయండి త్రివిక్రమ్ !

 

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ సినిమా ప్రకటన జరిగి చాలా రోజులే కావొస్తోంది.  కానీ ఇంకా సినిమా పట్టాలెక్కలేదు.  ఈలోపు బన్నీ సుకుమార్ డైరెక్షన్లో కొత్త సినిమాను కూడా ప్రకటించేశాడు.  దీంతో ప్రేక్షకుల్లో రకరకాల అనుమానాలు బయలుదేరాయి.  త్రివిక్రమ్ రెడీ చేసిన కథ బన్నీకి నచ్చలేదని కొందరంటే, ముందు సుకుమార్ సినిమా మొదలయ్యేట్టు ఉందని ఇంకొందరు అంటున్నారు.  ఇక టైటిల్ విషయంలో కూడా 'నాన్న నేను' అనే టైటిల్ ప్రాచుర్యంలోకి వచ్చేసింది.  దీంతో అభిమానుల్లో టెంక్షన్ మొదలైంది.  కాబట్టి త్రివిక్రమ్ అండ్ టీమ్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇస్తే బాగుంటుంది.  లేకుంటే ఇలాంటి వార్తలే ఇంకొన్ని పుట్టుకొచ్చే ప్రమాదముంది.