దేవీశ్రీని పక్కన పెట్టిన త్రివిక్రమ్

దేవీశ్రీని పక్కన పెట్టిన త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు తన సినిమాలలో చాలా వరకు వాటికి సంగీతం అందించిన దేవీశ్రీ ప్రసాద్‌ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. త్రివిక్రమ్ దర్శకుడిగా తన కెరీర్‌లో ఎన్నో హిట్లు అందుకున్నాడు. వాటి చాలా సినిమాలను దేవీశ్రీనే బాణీ అందించాడు. ప్రతి సినిమాలో కూడా దేవీ సంగీతం ప్రత్యేక అట్రాక్షన్‌గా నిలిచింది. కానీ వీరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ డీఎస్‌పీని త్రివిక్రమ్ పక్కన పెట్టాడు. త్రివిక్రమ్ వరుసగా తన సినిమాలకు దేవీ దూరం పెట్టాడు. మొదట డీఎస్‌పీ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో పక్కన పెట్టాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ వీరి మధ్య ఏవిషయంలో మనస్పర్థలు వచ్చాయని అందుకే దేవీకి త్రివిక్రమ్ అవకాశం ఇవ్వడం లేదని అనుకుంటున్నారు. అరవింద సమేతా సినిమాతో త్రివిక్రమ్ తన సినిమాలో థమన్‌కు అవకాశం ఇచ్చాడు. ఆ తరువాత అలా వైకుంఠపురములో సినిమాకు కూడా థమన్‌ సంగీతం అందించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఎన్నో రికార్డులను తిరగరాసింది. దీంతో ఎన్‌టీఆర్‌తో చేయనున్న నూతన చిత్రానికి కూడా త్రివిక్రమ్ థమన్‌నే ప్రిఫర్ చేస్తున్నాడు. దీంతో ప్రస్తుతం త్రివిక్రమ్ డీఎస్‌పీని ఎందుకు పక్కన పెట్టాడని సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే దేవీ టైమింగ్ కారణంగానే త్రివిక్రమ్ అతడిని పక్కన పెడుతున్నాడని అంటున్నారు. దేవీ టైమింగ్ విషయంలో త్రివిక్రమ్ ఒకసారి చిరాకు పడ్డాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై త్రవిక్రమ్ క్లారిటీ ఇవ్వాలి. అంతవరకూ వేచి ఉండాల్సిందే.