తెలుగు రాష్ట్రాలకు మాటల మాంత్రికుడు విరాళం... 

తెలుగు రాష్ట్రాలకు మాటల మాంత్రికుడు విరాళం... 

తెలుగు రాష్ట్రాలను కరోనా వైరస్ భయపెడుతున్నది.  ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 700 లకు చేరువైంది.  13 మరణాలు సంభవించాయి.  ప్రజలు ఆదుకోవడానికి ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.  లాక్ డౌన్ ను విధించి ఇంట్లోనే ఉండేలా చేస్తున్నారు.  అభివృద్ధి, ఇతర పరిపాలన విషయాలను పక్కన పెట్టి ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టి నిధులు ఖర్చు చేస్తున్నారు.  

ఇక ప్రభుత్వానికి చేయూతను అందించేందుకు ప్రముఖులు సైతం ముందుకు వస్తుండటం శుభపరిణామం అని చెప్పుకోవాలి.  విపత్తులు సంభవించినపుడు ముందుకు వచ్చి సహాయసహకారాలు అందించే తెలుగు సినిమా  పరిశ్రమ ఈ విషయంలోనూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తోంది.  ఇప్పటికే కొంతమంది సినీ ప్రముఖులు సహాయాన్ని ప్రకటించారు.  పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే తెలుగు రాష్ట్రాలకు, కేంద్రానికి తన వంతు సహాయం ప్రకటించారు.  ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్నేహితుడు, సినీ దర్శకుడు అల్లు అరవింద్ తనవంతు సహాయం అందుంచేందుకు ముందుకు వచ్చారు.  తెలుగు రాష్ట్రాలకు కరోనా సహాయం కింద రూ.20 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.  ఈ విషయాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.