థియేటర్స్ బిజినెస్ లోకి త్రివిక్రమ్..!!!

థియేటర్స్ బిజినెస్ లోకి త్రివిక్రమ్..!!!

త్రివిక్రమ్ శ్రీనివాస్ థియేటర్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టాడు.  వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న త్రివిక్రమ్.. ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. తన సంపాదనలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెట్టె త్రివిక్రమ్.. ఇప్పుడు థియేటర్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టాడు.  

తూర్పగోదావరి జిల్లాలోని రాజాం లోని రాయుడు థియేటర్ను కొనుగోలు చేసి..దానికి ఆధునిక హంగులు చేకూర్చినట్టు తెలుస్తోంది.  త్వరలోనే త్రివిక్రమ్ ఈ థియేటర్ ను ఓపెన్ చేయబోతున్నాడు.  ఏ సినిమాతో ఈ థియేటర్ ఓపెన్ అవుతుందో చూడాలి.  ఈ థియేటర్ కోసం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.