యంగ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా  .?

యంగ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా  .?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఫస్ట్ ఉండే డైరెక్టర్ త్రివిక్రమ్ . ఈ ఏడాది అల వైకుంఠపురంలో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మాటల మాంత్రికుడు తన నెక్స్ట్ సినిమాను కూడా అనౌన్స్ చేసాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయనున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటించనున్నాడు. ఇటీవలే ఎన్టీఆర్ కు సంబందించిన టీజర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు తారక్ . ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్ , హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నాయి. అయితే తారక్ ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకొని రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది.. ఈ గ్యాప్ లో సువర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి .కానీ అవి పుకార్లు గానే మిగిలిపోయాయి. తాజాగా ఓ యంగ్ హీరోకి కథ చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రామ్ తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నాడని ఫిలిం నగర్ టాక్ . ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనుందట . ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా  జరుగుతుందట త్వరలోనే ఈ సినిమాని ఎనౌన్స్ చేయనున్నారని సమాచారం . త్రివిక్రమ్ తో సినిమా అంటే రామ్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టే . చూడాలి  మరి ఎం జరుగుతుందో .