ఈ సినిమా నాకు మరో అతడు: త్రివిక్రమ్

ఈ సినిమా నాకు మరో అతడు: త్రివిక్రమ్

2020వ సంవత్సరంలో ది బెస్ట్ మూవీగా నిలిచిన ‘అల వైకుంఠపురములో’ గత ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం విడుదలై మంగళవారానికి ఏడాది పూర్తి అవుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ సినిమా బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా రికార్డుల మీద రికార్డులతో మోత మోగించింది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని బుట్టబొమ్మ సాంగ్‌తో బోలెడు రికార్డులను ఈ చిత్రం బుట్టలో వేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ రీయూనియన్ పేరుతో సోమవారం రాత్రి గ్రాండ్ ఫంక్షన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ దర్శకుడు త్రివిక్రమ్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలో నటించిన నటీనటులు, ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు అందరూ ఆ సినిమా తాలూకా మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈవెంట్ లో డైరెక్టర్ త్రివిక్రమ్ స్పీచ్ ఎప్పటిలాగే ఈసారి కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. త్రివిక్రమ్ స్పీచ్ పై మీరు ఓ లుక్కేయండి.