త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు

త్రివిక్రమ్ డైరెక్షన్లో మహేష్ బాబు

త్రివిక్రమ్... మహేష్ బాబు కాంబినేషన్లో రెండు సినిమాలు వచ్చాయి.  అందులో ఒకటి అతడు.  క్రైమ్ థ్రిల్లర్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టైంది.  దీని తరువాత ఖలేజా చేశారు.  యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనా... బుల్లితెరపై మాత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  

ఖలేజా తరువాత ఈ ఇద్దరు కలిసి పనిచేయలేదు.  అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ తో సినిమాలు చేశాడు.  ఇంతకాలం తరువాత మరలా మహేష్ తో కలిసి పనిచేయబోతున్నాడు త్రివిక్రమ్.  అయితే, ఇది సినిమాకు కాదు... ఓ యాడ్ ఫిలిం కోసమే.  

ఓ యాప్ కు సంబంధించిన యాడ్ ను చేసేందుకు త్రివిక్రమ్ కు అవకాశం వచ్చింది.  మంచి డీల్ కావడంతో.. మహేష్ తో యాడ్ చేసేందుకు వెంటనే ఒకే చేశారట.  అల్లు అర్జున్ సినిమా బిజీలో ఉన్న త్రివిక్రమ్ ఆ పనికి రెండు రోజులు గ్యాప్ ఇచ్చి.. ఈ యాడ్ ఫిల్మ్ చేయబోతున్నారట.  ఏప్రిల్ 10 న ఈ యాడ్ షూట్ ఉంటుంది.