రాజమౌళిలా త్రివిక్రమ్ కూడా ప్లాన్ చేస్తున్నాడా?

రాజమౌళిలా త్రివిక్రమ్ కూడా ప్లాన్ చేస్తున్నాడా?

భారీ చిత్రాలు తీయాలంటే రాజమౌళికి మాత్రమే సాధ్యం అయ్యేలా ఉంటాయి.  మొదటి సినిమా నుంచి మొన్నటి బాహుబలి వరకు ప్రతిదీ ఆకట్టుకుంది.  బాహుబలి సినిమా దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం రాజమౌళి రామ రౌద్ర రుషితం సినిమా చేస్తున్నారు.  ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  

సైరా సినిమాతో సురేందర్ రెడ్డి కూడా తనను తాను నిరూపించుకున్నాడు. సైరా దాదాపు రూ. 300 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించారు.  ఈ సినిమాను సురేందర్ రెడ్డి స్టైలిష్ గా చిత్రీకరించారు.  అయితే, రాజమౌళిలా అద్భుతంగా చిత్రీకరించకపోయినా.. సినిమాకు మంచి పేరు వచ్చింది.  అటు క్రిష్ కూడా కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి, మణికర్ణికా సినిమాలు తీశారు. త్రివిక్రమ్, సుకుమార్ దర్శకులు భారీ సినిమాలు చేయాల్సి ఉన్నది.  త్రివిక్రమ్ కూడా ఇలాంటి భారీ సినిమాకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.  ఒకవేళ బాహుబలి వంటి సినిమాను త్రివిక్రమ్ సినిమాను తీయాల్సి వస్తే ఎలా తీస్తాడో..