నిర్మాత కాళ్లు పట్టుకున్న త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా..

నిర్మాత కాళ్లు పట్టుకున్న త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా..

టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోలలో రామ్ కూడా ఒకడు. ఎనర్జటిక్‌ హీరోగా కూడా అభిమానులు అతడిని పిలుస్తారు. అయితే రామ్, పూరీ జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ ఆ సినిమాలో ఫూల్ మాస్ పాత్రతో అందరిని ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు రామ్ మరో మాస్ అండ్ క్లాస్ సినిమా రెడ్‌లో నటించాడు. ఈ సినిమా గతేడాది ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల మందుకు రానుంది. ఈ చిత్రంలో రామ్ రెండు పాత్రలలో చేశాడు. వాటిలో ఒకటి ఊర మాస్‌గా కనపించగా మరొకటి పక్కా క్లాస్‌గా కపించాడు. రెండింటిలోనే తనదైన నటన కనబరిచిన రామ్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెట్టుకున్నాడు. ఈ సినిమా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో మాల్వికా శర్మా, అమ్రితా అయ్యర్‌లు హీరోయిన్‌లుగా చేశారు. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో టాలెంటెడ్ నటి నివేథా పేతురాజ్ కనిపించింది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను జరుపుతున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈ వెంట్‌కు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అందరూ ఎంతో కష్టపడి చేశారని అన్నారు. అంతేకాకుండా నిర్మాత రవికిషోర్ గురించి మాట్లాడకుండా వెళ్లకూడదంటూ చెప్పుకొచ్చాడు. ‘నేను స్వయంవర సినిమా తర్వాత నాకు ఎవరరూ సినిమాలు ఇవ్వడంలేదు. ఆ సమయంలో నేను నా సొంతూరు భీమవరం వెళ్లిపోయాను. అటువంటి సమయంలో నాకు ఫాన్ చేసి పిలిపించి నువ్వే కావాలి సినిమా కథ రాయించారు. దాని తరువాత నువ్వు నాకు నచ్చావ్ కథ నేను రాసేటప్పుడు ఆ ఫైల్ తన వద్దనే ఉంచుకొని అర్థరాత్రి నాకు ఫోన్ చేసి ఇందులో ఈ డైలాగ్ ఎంతబాగుందని నాకు వినిపించేవారు. నేను రాసిన కథ మొత్తం చదవేవారు. నాకు చాలా సంతోషం వేసింది. ఇటువంటి వారికి నేను నాలుగు సినిమాలు రాసే అదృష్టం నాకు దక్కడం నాకు వరంగా అనుకుంటున్నాను. ఆయన గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే’ అని ఆయన అన్నారు. అంతేకాకుండా వారితో నేను పనిచేయడం నాకు చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్‌గా ఉంది. తాను ఎంత గొప్ప దర్శకుడు అయినా రవి కిషోర్‌కి రుణపడిఉంటానంటూ ఆయన కాళ్లు పట్టుకున్నాడు. ఈ దృశ్యం చూసిన అభిమానులు హర్షద్వానాలతో మారుమోగిపోయింది.