త్రివిక్రమ్ సినిమాకు లైన్ క్లియర్ చేసేందుకు మెగా ప్రయత్నం..!!

త్రివిక్రమ్ సినిమాకు లైన్ క్లియర్ చేసేందుకు మెగా ప్రయత్నం..!!

ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా చేసిన తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. రెండు సినిమాలను ఇటీవలే ప్రకటించారు.  రెండు మెగా కాంపౌండ్ సినిమాలే.  అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవితో కాగా, రెండోది అల్లు అర్జున్ తో సినిమా.  మెగాస్టార్ సినిమాను వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించగా, అల్లు అర్జున్ సినిమాను డిసెంబర్ 31 వ తేదీన ప్రకటించారు.  

మెగాస్టార్ ప్రస్తుతం సైరా సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా తరువాత కొరటాల సినిమా చేయాలి.  కొరటాల సినిమా పూర్తయ్యే సరికి 2020 వ సంవత్సరం వస్తుంది.  సైరా పూర్తయ్యాక కొరటాల శివ సినిమా చేద్దామని మెగాస్టార్ అనుకున్నాడు.  కానీ ఇప్పుడు సైరాతో పాటు కొరటాల సినిమా కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  సైరా, కొరటాల సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు.  సైరా ఆగస్టు లో రిలీజ్ అవుతుంది.  కొరటాల సినిమాను దీపావళికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  ఈ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ అవుతుంది.  

ఈలోపు త్రివిక్రమ్ మరో మెగా కాంపౌండ్ హీరో అల్లు అర్జున్ తో సినిమాను కంప్లీట్ చేస్తారని సమాచారం.  అల్లు అర్జున్.. త్రివిక్రమ్ సినిమాను న్యూ ఇయర్ ముందు రోజు ప్రకటించారు.  కథను కూడా లాక్ చేసినట్టు సమాచారం.