త్రివిక్రమ్.. అల్లు అర్జున్.. ముహూర్తం కుదిరింది..!!

త్రివిక్రమ్.. అల్లు అర్జున్.. ముహూర్తం కుదిరింది..!!

అరవింద సమేత సినిమా తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా సెట్ అయింది.  అంతకు ముందు అల్లు అర్జున్ అనేక కథలు విన్నప్పటికి పెద్దగా నచ్చలేదు.  విక్రమ్ కుమార్ తో సినిమా అనుకున్నా.. అనుకున్నట్టుగా స్క్రిప్ట్ రాకపోవడంతో సినిమాను పక్కన పెట్టారు.  ఎట్టకేలకు అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాకు ఓకే చెప్పేశాడు.  

బాలీవుడ్ లో సూపర్ హిట్టైన సినిమాను రీమేక్ చేయబోతున్నారని సమాచారం.  అల్లు అరవింద్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాకు నిర్మిస్తున్నాయి.  ఈ సినిమా ఓపెనింగ్ ముహూర్తం కుదిరింది.  ప్రేమికుల దినోత్సవం రోజున ఈ సినిమా ఓపెనింగ్ కాబోతున్నది.  ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేసి, దసరాకు సినిమాను రిలీజ్ చేయాలనే లక్ష్యంతో సినిమాను షూట్ చేయబోతున్నారు.