పవన్ కు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారా.. నిజమెంత?

పవన్ కు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారా.. నిజమెంత?

టాలీవుడ్ యాక్ట‌ర్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ చిత్రం ‘అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్’ రీమేక్ చేసేందుకు ఇటీవలే పూజాకార్యక్రమాలు చేసుకున్న విషయం తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో స్టార్ట్ కానుంది. అయితే, ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాటలు అందిస్తాడని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. 

కాగా, ఈ సినిమాకు త్రివిక్రమ్ వర్క్ చేస్తాడన్న విషయాన్ని చిత్ర బృందం ఇప్పటివరకు ప్రకటించలేదు. దింతో పవన్ కోసం త్రివిక్రమ్ మాటలు రాస్తాడనీ, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా వర్క్ చేస్తాడనే వివ‌రాల‌పై ఇంకా స‌స్పెన్స్ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా సమాచారం మేరకు, హీరోలు పవన్ కళ్యాణ్, రానాలకు ఈ సినిమా యూనిట్ ప్రత్యేకంగా రూపొందించిన వీడియోల ద్వారా వెల్కమ్ చెప్పినట్టుగా త్రివిక్రమ్ కోసం కూడా అదే విధంగా ఒక ప్రత్యేక వీడియోను రూపొందిస్తుందట చిత్ర బృందం. వీడియో రూపొందించాలన్న ప్రణాళికను చిత్రబృందం చేస్తునట్టు టాక్. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.