మెగా హీరోను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్

మెగా హీరోను డైరెక్ట్ చేస్తున్న త్రివిక్రమ్

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా మంది అనుకుంటారు.  ఆ అవకాశం కొంతమందికే వస్తుంది.  రాజకీయాల నుంచి తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టాక మెగాస్టార్ చేసిన ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ కావడంతో.. నెక్స్ట్ సినిమాగా సైరా చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే భరత్ అనే నేను దర్శకుడు కొరటాల శివ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  వచ్చే ఏడాది నుంచి ఇది సెట్స్ మీదకు వెళ్తుంది.  

తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగాస్టార్ కోసం ఓ కథను రెడీ చేసి వినిపించినట్టుగా తెలుస్తున్నది.  కథ నచ్చడంతో మెగాస్టార్ ప్రొసీడ్ అవ్వమని చెప్పినట్టుగా కథనాలు వినిపిస్తున్నాయి.  మెగాస్టార్ తో వరసగా సినిమాలు చేయాలని రామ్ చరణ్ అనుకుంటున్నాడు.  మెగాస్టార్ చేసే ప్రతి సినిమాను రామ్ చరణ్ నిర్మించబోతున్నాడు.  త్రివిక్రమ్.. మెగాస్టార్ సినిమాను కూడా చరణ్ నిర్మిస్తాడేమో..