జూబ్లీహిల్స్ నుంచి ఆర్కే బీచ్ దాకా ప్రయాణం అద్భుతం... 

జూబ్లీహిల్స్ నుంచి ఆర్కే బీచ్ దాకా ప్రయాణం అద్భుతం... 

అలవైకుంఠపురంలో సినిమా సక్సెస్ సెలెబ్రేషన్స్ ఈరోజు విశాఖలోని ఆర్కే బీచ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఈ సక్సెస్ మీట్ లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కొన్ని అద్భుతమైన విషయాలను గురించి చెప్పారు.  సినిమాను మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన భుజస్కందాలపై వేసుకొని నడిపించారని, అందరికంటే ఎక్కువగా థమన్ కష్టపడ్డారని అన్నారు.  అలానే విలువల కలిగిన సినిమాలు తీస్తే, దానికి తగ్గట్టుగా మ్యూజిక్ ఇస్తామని థమన్ చెప్పిన విషయం చెప్పింది.  ఆర్కే బీచ్ తో ఉన్న అనుబంధాన్ని త్రివిక్రమ్ వివరించారు. జూబ్లీహిల్స్ లోని ఆఫీస్ రూమ్ లో మొదలైన ప్రయాణం, ఆర్కే బీచ్ వరకు సాగిందని అన్నారు.