ఉత్తమ్ ప్రచారంలో రాళ్ల దాడి..!

ఉత్తమ్ ప్రచారంలో రాళ్ల దాడి..!

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఘర్షణ చోటు చేసుకుంది. మా ఊరికి ఏం చేశారంటూ ఉత్తమ్‌ను ప్రశ్నించడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓ యువకుడిని చితకబాదారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన జరిగింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పిక్ల నాయక్ తండాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సమయంలో శివ అనే టీఆర్ఎస్ కార్యకర్త ఉత్తమ్‌ని నిలదీశారు. గ్రామానికి ఏం చేశావంటూ ప్రశ్నించారు. వెంటనే అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి తమ్ముడు శివపై దాడికి దిగాడు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల్లో రాళ్లురువ్వుకున్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వారిని వారించే ప్రయత్నం చేసినా గొడవకు దిగాయి ఇరు వర్గాలు.