అన్ని జెడ్పీల కైవసానికి టీఆర్ఎస్ కసరత్తు..

అన్ని జెడ్పీల కైవసానికి టీఆర్ఎస్ కసరత్తు..

జిల్లా పరిషత్, మండలి పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం జరగనుంది. అయితే, అటు మండలి పరిషత్‌లు, ఇటు జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడానికి ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తోంది. జెడ్పీచైర్మన్ల ఎంపిక ప్రక్రియను సమన్వయం చేసేందు పార్టీ ఇంచార్జీలను ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉండబోతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్... రేపు కౌటింగ్ జరగనున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఏక పక్షంగా తీర్పు ఇవ్వనున్నరని తెలిపారు. అన్ని జెడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడానికి జిల్లాల వారీగా జెడ్పీ చైర్మన్ ఎన్నికల ఇంచార్జ్ లను ఇవాళ నియమిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. రేపు స్ధానిక సంస్ధల ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. దీంతోపాటు జడ్పీ చైర్మన్ల ఎంపిక 8వ తేదిన జరగనున్న నేపథ్యంతో పార్టీ తరపున గెలిచిన జెడ్పీటీసీలను సమన్వయం చేసుకుని, పార్టీ అధిష్టానం నిర్ణయించేవారిని జెడ్పీ చైర్మన్లుగా గెలిపించుకునేందుకు అవసరం అయిన ప్రక్రియను సమన్వయం చేసుకునే భాద్యత పార్టీ నిర్ణయించిన ఇంచార్జీలు చూసుకుంటారని పేర్కొన్నారు కేటీఆర్.