అంబర్ పేటలో కిషన్ రెడ్డి ఓటమి

అంబర్ పేటలో కిషన్ రెడ్డి ఓటమి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శాసనసభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అంబర్ పేట నియోజకవర్గంలో ఆయనపై టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ వెయ్యి ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. కాలేరు వెంక‌టేష్‌ (టీఆర్ఎస్‌) 61,558, జి.కిష‌న్‌రెడ్డి  (బిజేపి) 60,542 ,ర‌మేష్ (టిజేఎస్‌) 4,261 ఓట్లు పోల్ అయ్యాయి.

1999లో తొలిసారి కార్వాన్ నుంచి పోటీచేసి కిషన్ రెడ్డి ఓడిపోయాడు. అనంతరం హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి 2004లో పోటీచేసి గెలిచారు. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డి విజయం సాధించారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో హిమాయత్ సాగర్ రద్దు అయ్యి అంబర్ పేట అసెంబ్లీ కేంద్రంగా ఏర్పడింది. దీంతో 2014లో మూడోసారి అంబర్ పేట నుంచి పోటీచేసి ఏకంగా 69వేల ఓట్ల మెజార్టీతో కిషన్ రెడ్డి గెలిచారు. బీజేపీలో ఆలె నరేంద్ర తర్వాత అంతటి వరుస విజయాలు.. ఘనత పొందిన వ్యక్తిగా కిషన్ రెడ్డి పేరు సంపాదించారు.