తెలంగాణలో కారు జోరు..

తెలంగాణలో కారు జోరు..

సారు కారు.. 16 అంటూ తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. అలాగే ఇప్పుడు ఫలితాల్లో కారు దూకుడు చూపిస్తోంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా... ఏకంగా 13 లోక్‌సభ స్థానాల్లో టీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రెండు స్థానాల్లో... బీజేపీ అభ్యర్థి ఒక స్థానం, ఎంఐఎం అభ్యర్థి ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.