కారు క్లీన్‌స్వీప్..

కారు క్లీన్‌స్వీప్..

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ దుమ్మురేపుతోంది... రాష్ట్రంలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుండగా... మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలువడిన ఫలితాల్లో 1800కు పైగా స్థానాల్లో విజయం సాధించి.. మరింత స్పీడుగా దూసుకెళ్తోంది గులాబీ కారు. ఇక 600 సీట్లకు పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సొంతం చేసుకుగా... 100కు పైగా స్థానాల్లో భారతీయ జనతా పార్టీ... సీపీఎం, సీపీఐ, స్వతంత్రులు 250కి పైగా స్థానాల్లో విజయం సాధించారు. ఇక, ఇప్పటి వరకు వెలువడిన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఫలితాల్లో దాదాపు 10 జెడ్పీటీసీలను గులాబీ పార్టీ తన ఖాతాలో వేసింది. ఎంపీటీసీ ఫలితాల్లో అయితే.. కొన్ని మండలాల్లో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా... అన్ని స్థానాలను టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేయడం విశేషం.