పరిషత్ ఎన్నికల్లో కారు జోరు..

పరిషత్ ఎన్నికల్లో కారు జోరు..

మండల పరిషత్ ఎన్నికల్లోనూ కారు జోరు చూపిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొదట ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుండగా... అన్ని జిల్లాల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. కాగా, రాష్ట్రంలోని 538 జెడ్పీటీసీ, 5817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,426 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18,930 మంది ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. మే 6న మొదటి దశ, మే 10న రెండో దశ, మే 14న మూడో దశ.. ఇలా మొత్తం మూడు విడతలుగా పోలింగ్ నిర్వహించగా.. ఇవాళ ఒకేరోజు ఓట్ల లెక్కింపు జరుతోంది. 
ఇప్పటి వరకు వెలువడిన ఫలితాలు పరిశీలిస్తే..
వరంగల్ అర్బన్: టీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 2
వరంగల్ రూరల్: టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5
మహబూబాబాద్ జిల్లా: టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 4
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 3
ములుగు జిల్లా: టీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 5
జనగామ జిల్లా: టీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 5 విజయం సాధించారు. వివిధ జిల్లాల్లో మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకోగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన అభ్యర్థులు కూడా కొన్నిస్థానాలు కైవసం చేసుకున్నారు. మధ్యాహ్నానికి పూర్తిస్థాయిలో ఎంపీటీసీ ఫలితాలు వెల్లడికానుండగా... ఆ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
నిజామాబాద్ : బోధన్ మండలంలో టీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 2
సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ మండలం టీఆర్ఎస్2, కాంగ్రెస్ 6
మొగుడంపల్లి మండలంలో కాంగ్రెస్ 1
ఝరాసంగం మండలంలో 4 కాంగ్రెస్, 2 టీఆర్ఎస్ 
న్యాలకల్ మండలంలో 2 టీఆర్ఎస్, కాంగ్రెస్ 1
కొహీర్ మండలంలో కాంగ్రెస్ 4, టీఆర్ఎస్ 2