ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు

ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఫిర్యాదు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను టీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి,లీగల్ సెల్ అధ్యక్షుడు,  టిఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ భరత్ కుమార్ లు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భరత్ కుమార్ మాట్లాడుతూ ఓ టీవీ ఛానెల్ బీజేపీ ప్రచారకర్తగా మారింది. దీనిపై ఎస్ఈసీకి ఫిర్యాదు చేశామని అన్నారు. రేపు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసీ సూచించిందన్న ఆయన బీజేపీ మాత్రమే ప్రచారం చేస్తోందని అన్నారు. ఒక పార్టీని టార్గెట్ గా చేసి కథనాలు ప్రసారం చేస్తున్నారన్న ఆయన కొంతమందికి పైసలు ఇచ్చి మాట్లాడిస్తూ.. తిట్టిపిస్తున్నారు అని అన్నారు. హద్దు పద్దు లేకుండా మాట్లాడుతున్నారన్న ఆయన బిజెపికి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఈ కథనాల వెనుక ఎవరు ఉన్నారో బయటకు వచ్చేలా చేయాలని అయన అన్నారు. ఈ ప్రయివేటు ఛానెల్ పై ఎస్ఈసి చర్యలు తీసుకోవాలని అన్నారు. మాయమాటలు, మాయదారి పనులు, మోసం చేయడం బీజేపీకే తెలుసని అన్నారు. .