కాసేపట్లో తెలంగాణ భవన్ కు కీలక నేతలు.. జీహెచ్ఎంసీకి ప్రత్యేక బస్సుల్లో !

కాసేపట్లో తెలంగాణ భవన్ కు కీలక నేతలు.. జీహెచ్ఎంసీకి ప్రత్యేక బస్సుల్లో !

జీహెచ్‌ఎంసీ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులను దక్కించుకునేందుకు సిద్ధమైంది టీఆర్‌ఎస్‌. కాసేపట్లో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు భేటీ కానున్నారు. మేయర్‌, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడంపై నేతలు సభ్యులకు దిశా నిర్దేశం  చేస్తారు.  సమావేశం అనంతరం  జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి బస్సుల్లో బయల్దేరుతారు. కేకే, మంత్రులు కేటీఆర్‌, తలసాని గ్రేటర్ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.  సీఎం కేసీఆర్‌ ఇచ్చిన సీల్డ్‌ కవర్‌లో టీఆర్‌ఎస్‌ మేయర్, డిప్యూటీ  మేయర్‌ అభ్యర్తుల పేర్లు ఉన్నాయి. సభ్యులు వీరికే ఓటు వేస్తారు. ఇక ఇప్పటికే గ్రేటర్ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులకు టీఆర్‌ఎస్ విప్ జారీ చేసింది. రేపు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండటంతో... విప్ జారీ చేసింది. టీఆర్‌ఎస్ నుంచి మేయర్ ఎన్నిక పరిశీలకులుగా కేటీఆర్, తలసాని, కేకే ఉండబోతున్నారు. మరో వైపు జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ హాల్‌ను పరిశీలించారు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ పార్థసారథి.  రేపు జరిగే కార్యక్రమానికి దాదాపు 500ల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు.