టార్గెట్ 32 జెడ్పీలు..!

టార్గెట్ 32 జెడ్పీలు..!

త్వరలోనే జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు... దీని కోసం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌ వేదికగా జరిగే ఈ సన్నాహక సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. గత ఎన్నికలను అన్నింటిలో ఘన విజయం సాధించినట్టుగానే ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించనున్నారు గులాబీ బాస్. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను, మండల పరిషత్‌లను కైవసం చేసుకోవడమే టార్గెట్‌గా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్.