కొంగరకలాన్‌ సభ.. అభిమాని మృతి

కొంగరకలాన్‌ సభ.. అభిమాని మృతి

కొంగరకలాన్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రగతి నివేదన సభకు వస్తూ ఓ తెరాస అభిమాని మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద డీసీఎం వ్యానుపై నుంచి జారిపడి మృతి చెందాడు. దీంతో పెద్ద అంబర్‌ పేట వద్ద ఔటర్‌రింగురోడ్డుపై ట్రాఫిక్‌ భారీగా నిలిచిపోయింది. మృతుడు నల్గొండ జిల్లా మాదారం వాసి అబ్దుల్‌ జానీ(35)గా పోలీసులు గుర్తించారు. డీసీఎం నిండుగా ఉండటంతో అతను జారీ పడ్డాడు.