కాసేపట్లో టీఆర్ఎస్ సంయుక్త కార్యవర్గ సమావేశం

కాసేపట్లో టీఆర్ఎస్ సంయుక్త కార్యవర్గ సమావేశం

టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం మరికాసేపట్లో తెలంగాణ భవన్ లో జరగనుంది. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు, ప్రగతి నివేదన సభ ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలపై పూర్తి స్పష్టత రానుందని టీఆర్‌ఎస్‌ శ్రేణులు భావిస్తున్నాయి. డిసెంబరు 15 లోపు ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఇందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.