సీఎం కేసీఆర్ ను కలిసిన నామా 

సీఎం కేసీఆర్ ను కలిసిన నామా 

ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించిన నామా నాగేశ్వర్ రావు శుక్రవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. తిరుగులేని విజయం సాధించి ఎంపీగా ఎన్నికైనందుకు కేసీఆర్ ఆయనను అభినందించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎంపీగా విజయం సాధించిన అనంతరం నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిఆర్‌ఎస్ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల కృషితోనే ఎంపిగా విజయం సాధించానని, ప్రజల సహకారాన్ని ఎప్పటికీ మరువనన్నారు. ప్రజలు తనపై ఎంతో విశ్వాసంతోనే ఓటు వేసి గెలిపించారని, వారికి తాను నిత్యం అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కారిస్తానని ఆయన పేర్కొన్నారు.