అమిత్‌షాతో ఉత్తమ్ రహస్య భేటీ ఎందుకు?

అమిత్‌షాతో ఉత్తమ్ రహస్య భేటీ ఎందుకు?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాతో టి.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ఎందుకు రహస్యంగా సమావేశం అయ్యారని ప్రశ్నించారు టీఆర్ఎస్ నేత దానం నాగేందర్... హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రగతి నివేదన సభను విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సభ విజయవంతం అయినా కొందరు కాకి గోల చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డివి టిఆర్ఎస్ సభపై ఉత్త మాటలేనని కొట్టిపారేసిన దానం... సాధ్యం కాని హామీలతో ఉత్తమ్ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ హటావో తెలంగాణ బచావో కాదు... గాంధీ భవన్ లో ఉత్తమ్ కో హటావ్... కాంగ్రెస్ కో బచావ్ అని అంటున్నారని సెటైర్లు వేశారు. తెలంగాణలో బిజెపికి ఒక్క సీటు కూడా రాదని ప్రధాని మోడీకి... సీఎం కేసీఆర్ చెప్పారని వెల్లడించిన దానం నాగేందర్... ప్రగతి నివేదన సభ కాబట్టే... కేసీఆర్ రాజకీయ విమర్శలు చేయలేదన్నారు.