టీడీపీపై టీఆర్ఎస్ ఈసీకీ ఫిర్యాదు 

టీడీపీపై టీఆర్ఎస్ ఈసీకీ ఫిర్యాదు 

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ పథకాల ప్రకటనలను మీడియాలో ప్రచారం చేయడంపై టీఆర్ఎస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. టీడీపీ ప్రకటనలతో తెలంగాణ ఓటర్లపై ప్రభావితం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల ప్రకటనలు నిలిపివేయాలని అదనపు సీఈఓ జ్యోతి బుద్ధ ప్రకాష్ ఆ పార్టీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి కోరారు. ప్రభుత్వం డబ్బుతో ప్రకటనలు ఇస్తున్నారు. అయితే తెలంగాణలో టీడీపీ కూడా పోటీ చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు పార్టీ పరంగా ప్రకటనలు ఇవ్వొచ్చు. మాకు అభ్యంతరాలు లేవు. బీజేపీ కూడా మత విధ్వంసాలు రెచ్చగొట్టే విధంగా సోషియల్ మీడియాలో ప్రచారం చేస్తోందని వారు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వీటి అన్నింటినీ వెంటనే కట్టడి చేయాలని ఈసీ కోరారు.