టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం

అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు తృటిలో ప్రమాదం తప్పింది. మల్కజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చిక్కడపల్లి సాయికృష్ణ హోటల్ లో ఓ ఫంక్షన్ కు హజరయ్యారు. మొదటి అంతస్తు నుంచి లిఫ్ట్ పడిపోవడంతో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. దీంతో వెంటనే యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.