ఆమె ఓటమి పక్కా..? మున్సిపల్ టికెట్‌ ఇచ్చినా ఆశ్చర్యం లేదు..!

ఆమె ఓటమి పక్కా..? మున్సిపల్ టికెట్‌ ఇచ్చినా ఆశ్చర్యం లేదు..!

హుజూర్‌నగర్ ఉప ఎన్నికలు ఇప్పుడు టీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపాయి... తాజాగా పీసీసీ చీఫ్‌ ఉత్తమ్ కుమార్ రెడ్డి... మంత్రి కేటీఆర్‌ ఓ బచ్చా అంటూ వ్యాఖ్యానించడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి... కేటీఆర్ బచ్చా అయితే మరి రాహుల్ గాంధీ ఏంటని ప్రశ్నించారు. ఇక, కేసీఆర్‌ది కుటుంబపాలన అంటున్నారు.. మరి కాంగ్రెస్ పార్టీది ఏంటి? అని మండిపడ్డారు. మరోవైపు గత ఎన్నికల్లో కోదాడలో ఓడిపోయిన పద్మావతి రెడ్డికి హుజూర్‌నగర్ టికెట్‌ కేటాయించడాన్ని ఎద్దేవా చేసిన జీవన్ రెడ్డి... హుజూర్‌నగర్‌లో పద్మావతి ఓడిపోవడం ఖాయమని.. ఓడిపోయిన తర్వాత ఆమెకు మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా ఆశ్చర్యం లేదంటూ సెటైర్లు వేశారు.