టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లికి చేదు అనుభవం...

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లికి చేదు అనుభవం...

తెలంగాణలో గ్రేటర్‌ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కూడా తార స్థాయికి చేరుకుంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు చేదు అనుభవం ఎదురైంది.  రోడ్డు వేస్తేనే మేము ఓటు వేస్తామని యాప్రాల్ లో స్థానికులు రోడ్డెక్కి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ను ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ అడ్డగించారు. దీంతో మైనంపల్లి హనుమంతరావు స్థానికులతో  చర్చించారు.  ఎలక్షన్లు అయిపోయిన వెంటనే తన సొంత నిధులతో రోడ్లు బాగు చేస్తానని వాగ్దానం చేసి తన లెటర్ పాడ్ పై సంతకం చేసి స్థానికలకు అందజేశారు. దీంతో స్థానికులు ప్రభుత్వానికి  మేము టాక్స్ కడుతున్నామని...  మీసొంత నిధులు మాకు అక్కరలేదని అన్నారు. ఎమ్మెల్యే వారికి నచ్చజెప్పి త్వరలోనే రోడ్లు వేస్తామని..  స్థానికులతో ధర్నా విరమింప చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.