టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు

టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేసే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్ధులను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు. పట్నం మహేందర్ రెడ్డి(రంగారెడ్డి), పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(వరంగల్), తేరా ప్రతాపరెడ్డి(నల్లగొండ) లను బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. తుది కసరసత్తు కోసం ఏడుగురు మంత్రులతో సీఎం కేసీఆర్ ఆదివారం చర్చించారు. ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, జగదీశ్ రెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్ అలీతో భేటీ అయ్యారు. శుక్రవారం సీఎం కేసీఆర్ చెన్నై పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అభ్యర్థుల కసరత్తును వేగవంతం చేశారు.