ఎవరా ముగ్గురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు?

ఎవరా ముగ్గురు టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు?

తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఇవాళ ప్రకటించబోతున్నారు. కేరళ, తమిళనాడు పర్యటన ముగించుకుని హైదరాబాద్‌ వచ్చిన కేసీఆర్‌.. ఇవాళ అభ్యర్థిత్వాలను ఖరారు చేయబోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు మంత్రులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కుతుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. అజ్మీరా చందూలాల్‌, పట్నం మహేందర్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావుల్లో ఎవరికైనా ఛాన్స్‌ దక్కుతుందా అనే విషయంపై ఇవాళ క్లారిటీ రానుంది. నకిరేకల్ నుంచి పోటీ చేసిన వేముల వీరేశంతోపాటు కేసీఆర్‌పై కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిలకు ఏమేర అవకాశం ఉందో ఇవాళ తేలిపోనుంది. ఇక.. మే 14తో ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ గడవు ముగుస్తుంది. మే 31న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 3వ తేదీన కౌంటింగ్ నిర్వహిస్తారు.