బహిష్కరణపై స్పందించిన యాదవరెడ్డి

బహిష్కరణపై స్పందించిన యాదవరెడ్డి

టీఆర్ఎస్ పార్టీ నుంచి నన్ను బహిష్కరించినట్లు తనకు ఎలాంటి లేఖ అందలేదని ఎమ్మెల్సీ కే. యాదవరెడ్డి స్పష్టం చేశారు. కనీసం వివరణ అడగకుండా పార్టీ నుంచి బహిష్కరించడం బాధాకరమన్నారు. టీఆర్‌ఎస్ పార్టీకి సిద్ధాంతాలు లేవని, నేను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, దమ్ముంటే నిరూపించాలని మండిపడ్డారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఈరోజు టీఆర్ఎస్ అధిష్టానం ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.