ఆ సత్తా టీఆర్ఎస్ ఎంపీలకే ఉంది

ఆ సత్తా టీఆర్ఎస్ ఎంపీలకే ఉంది

రాష్ట్రానికి కావాల్సిన నిధుల్ని తీసుకొచ్చే సత్తా టీఆర్ఎస్ ఎంపీలకే ఉందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లో ఎమ్మెల్యే బాజిరెడ్డితో కలిసి కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో  రోడ్‌షో నిర్వహించి స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని, నిరుపేదలకు వంద శాతం రాయితీతో రుణాలిస్తామని కవిత హామీ ఇచ్చారు. ఏడాదిలో కాళేశ్వరం నీటితో గ్రామాలను సస్యశ్యామలం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం తరహాలో దేశం సమగ్ర అభివృద్ధి జరగాలంటే 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ కే పట్టం కట్టాలని ఎంపీ కవిత ప్రజలను కోరారు.