కేసీఆర్‌తో భేటీకానున్న డీఎస్...

కేసీఆర్‌తో భేటీకానున్న డీఎస్...

తెలంగాణ పొలిటిక్ సర్కిల్‌లో ఇప్పుడు డీఎస్ వ్యవహారంపై చర్చ సాగుతోంది... పార్టీలో చేరగానే కేబినెట్ హోదా ఇచ్చి గౌరవిస్తే... టీఆర్ఎస్‌లో ఉంటూనే బీజేపీలో ఉన్న తన కుమారుడికి అనుకూలంగా పనిచేయాలంటూ డీఎస్ కార్యకర్తలపై ఒత్తిడి తెస్తున్నాడని నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ.... ఆయనపై గులాబిదళపతి కేసీఆర్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు కూడా చేశారు. పార్టీ అధ్యక్షుడి కేసీఆరే... డీఎస్ వ్యవహారంలో నిర్ణయం తీసుకుంటారని ప్రకటించారు ఎంపీ కవిత. అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం కానున్నారు డి.శ్రీనివాస్... ప్రగతి భవన్‌లో కేసీఆర్‌, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ మధ్య ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీ తర్వాత డీఎస్ విషయంలో కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.