నేను కాంగ్రెస్‌తో టచ్‌లో లేను..

నేను కాంగ్రెస్‌తో టచ్‌లో లేను..

ఆయనకు టీఆర్ఎస్ టికెట్ కష్టం..! కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్‌లో ఉన్నారు..! టీఆర్ఎస్‌ టికెట్ రాకపోతే.. ఈ సారి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారు..! అంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి. ఎన్టీవీతో  ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన... కాంగ్రెస్‌ పార్టీతో టచ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. వంద‌కు వంద శాతం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీ టికెట్ త‌న‌కే అని ధీమా వ్యక్తం చేసిన జితేంద‌ర్ రెడ్డి.. మా పార్టీ అధినేత కేసీఆర్‌పై పూర్తి నమ్మకం ఉంది... గిట్టని వారు పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేశానన్న జితేందర్ రెడ్డి.. తాను కాంగ్రెస్‌తో టచ్‌లో లేను.. నేను మొద‌టి నుంచీ కాంగ్రెస్ వ్యతిరేకిని.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసినవాడినని వెల్లడించారు.