కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్...

కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్...

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయ సభల్లో రాఫెల్ అంశంపై చర్చలు నడుస్తున్నాయి. రాఫెల్ అంశంపై అధికార, విపక్షాల మధ్య జరిగే వాదనలతో ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాఫెల్ అంశాన్ని ఉద్దేశించి.. టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'రోజు మారినా ఉభయసభల్లో పాత కథే పునరావృతం అవుతుంది' అని ట్వీట్ చేశారు. సభలు సజావుగా సాగనీయొద్దని కాంగ్రెస్, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాయని కవిత పేర్కొన్నారు.