పార్లమెంట్ ప్రాంగణంలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన

పార్లమెంట్ ప్రాంగణంలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన

టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎంపీలు మోడీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన‌ వ‌్య‌వ‌సాయ బిల్లులకు వ్య‌తిరేకంగా పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో నిర‌స‌న‌కు దిగారు. రైతాంగాన్ని కాపాడండి, సేవ్ ఫార్మ‌ర్స్, సేవ్ వ‌ర్క‌ర్స్‌, సేవ్ డెమోక్ర‌సీ అని రాసి ఉన్న ప్ల‌కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ నిర‌స‌న వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ లోక్‌స‌భాప‌క్ష నేత నామా నాగేశ్వ‌ర్‌రావు ఆధ్వ‌ర్యంలో ఎంపీలు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లో పాల్గొన్నారు. మోడీ స‌ర్కారు రైతులకు న‌ష్టం చేకూర్చేలా ఉన్న వ్య‌వ‌సాయ బిల్లుల‌ను పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో ఏక‌ప‌క్షంగా ఆమోదించుకుంద‌ని ఆరోపించారు. రైతు వ్య‌తిరేక‌ బిల్లుల ఆమోదం విష‌యంలో విప‌క్షాల అభ్యంత‌రాల‌ను లెక్క చేయ‌కుండా కేంద్రం నియంతృత్వ ధోర‌ణి అవ‌లంభించింద‌ని విమ‌ర్శించారు. ఆ త‌ర్వాత తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు కూడా టీఆర్ఎస్ ఎంపీల‌తో క‌లిసి వ్య‌వ‌సాయ బిల్లుల‌పై త‌మ నిర‌స‌న వ్య‌క్తంచేశారు.