టీఆర్ఎస్ ఓ వెలమ కంపెనీ..

టీఆర్ఎస్ ఓ వెలమ కంపెనీ..

టీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదని.. వెలమ కంపెనీ అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.  ఈరోజు గాంధీభవన్ లో ఏఐసీసీ ఇంచార్జి కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుంతియా సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ జాతీయ పార్టీగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మోడీ.. కేసీఆర్ ను.. ఎదుర్కొనేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.   2019లో ఎన్నికలు వచ్చినా.. 2018లో వచ్చినా ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. టీఆర్ఎస్ అస్తవ్యస్త పాలన పట్ల ప్రజలు విసుగెత్తి ఉన్నారని.. కేసీఆర్.. ఆయన కుటుంబాన్ని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారని వెల్లడించారు. తాము ఏడాది నుండి చెప్తున్నామని.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ ఈ రోజే వెళ్లి గవర్నర్ ను కలిసి రాజీనామా చేస్తే తాము వొద్దంటామా? ఎంతమాత్రం వద్దనం అంటూ వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీని ఏ ఒక్క రోజు కూడా సలహాలు అడగని కేసీఆర్.. ఎన్నికల కోసం మాత్రం అడుగుతారని.. ఇదో ఇదో విచిత్రమైన పరిస్థితి అని ఉత్తమ్ వెల్లడించారు.