ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఫోకస్..

ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఫోకస్..

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయగాన్ని సొంతం చేసుకున్నారు.. మెజార్టీ సర్పంచ్‌లను గెలిపించుకున్నారు.. లోక్‌సభ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసి.. 16 స్థానాల్లో విజయం మాదేననే విశ్వాసంతో ఉన్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఇక త్వరలోనే జరిగే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. దీని కోసం ఈనెల 15వ తేదీన టీఆర్ఎస్ పార్టీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించాలని సీఎం, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయించారు. 15న మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌ వేదికగా జరిగే ఈ సన్నాహక సమావేశానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీలుగా పోటీ చేసిన అభ్యర్థులు, రాజ్యసభ సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులను ఆహ్వానించారు. గత ఎన్నికలను అన్నింటిలో ఘన విజయం సాధించినట్టుగానే ఇప్పుడు జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించనున్నారు గులాబీ బాస్.