జూపల్లికి టిఆర్ఎస్ షాక్... ఎందుకంటే... 

జూపల్లికి టిఆర్ఎస్ షాక్... ఎందుకంటే... 

తెలంగాణ ఎన్నికల్లో కారు దూసుకుపోయింది.  120 మున్సిపాలిటీలకు గాను ఏకంగా 96 చోట్ల విజయకేతనం ఎగరేసింది.  ఈ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తెరాస పార్టీకి సొంత పార్టీ నుంచే కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి.  మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన మద్దతు దారులకు టికెట్స్ ఇవ్వకపోవడంతో అయన తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను బరిలోకి దించారు.  కొల్లాపూర్ లో రెబల్స్ గా బరిలోకిదిగిన జూపల్లి వర్గీయులు 11 మంది విజయం సాధించారు.  మొత్తం 20 వార్డుల్లో 11 మంది రెబల్స్ గెలవడం తెరాస పార్టీని ఇబ్బంది పెట్టింది.  

మరోవైపు అయిజ మున్సిపాలిటీలో కూడా జూపల్లి వర్గీయులైన 10 మంది విజయం సాధించారు.  జూపల్లి విషయంలో కెసిఆర్ చాలా సీరియస్ గా ఉన్నారు.  ఎలాగైనా జూపల్లికి చెక్ పెట్టాలని చూస్తున్నారు.  రెబల్స్ గా పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థుల మద్దతు తీసుకోకూడదు అని  నిర్ణయం తీసుకున్నారు.  ఎక్స్ అఫిషియో సహకారంతో కొల్లాపూర్ నియోజక వర్గాన్ని కైవసం చేసుకోవాలని చూస్తున్నది.  కొన్ని చోట్ల పార్టీ అభ్యర్థులకంటే కూడా రెబల్స్ అధిక సంఖ్యలో విజయం సాధించడం ఆ పార్టీని కలవరపెడుతున్నది.