50 రోజుల్లో 100 సభలు...

50 రోజుల్లో 100 సభలు...

ముందస్తుకు సై అంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి అందుకు తగ్గట్టుగానే వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 50 రోజుల్లో 100 సభలు నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది టీఆర్ఎస్... హుస్నాబాద్‌లో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న బహిరంగసభ స్థాలాన్ని మంత్రి హరీష్‌రావుతో కలిసి పరిశీలించిన ఈటల రాజేందర్... నాలుగున్నారేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్న ఉద్దేశంతో బహిరంగసభలను నిర్వహిస్తున్నామని... ప్రజల ఆశీర్వాదం కోసం రోజుకు రెండు చొప్పున 50 రోజుల్లో 100 సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తానున్నామని... ఈ సభలు హుస్నాబాద్ నుంచే ప్రారంభం అవుతాయని ప్రకటించారు.