32 జెడ్పీ స్ధానాలు గెలవాలి: కేసీఆర్

32 జెడ్పీ స్ధానాలు గెలవాలి: కేసీఆర్

రాష్ట్రంలో మొత్తం 32 జడ్పీ, 530కి పైగా మండల పరిషత్‌ స్థానాలను కైవసం చేసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. సోమవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృత స్ధాయి సమావేశం జరిగింది. కేసీఆర్ నేతృత్వంలో జరిగిన ఈ భేటిలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలపై చర్చించారు. స్ధానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ఒక్కో జిల్లా పరిషత్‌కు ఓ సీనియర్‌ నేతకు బాధ్యతలు అప్పగించారు. మండల పరిషత్‌లలో బాధ్యతలను ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చూసుకోవాలని సూచించారు.  అభ్యర్థుల ఎంపిక, కార్యవర్గం ఏర్పాటు తదితర ప్రక్రియ పూర్తయ్యేవరకూ అవసరమైన ఏర్పాట్లన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు. ఆసిఫాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా కోవా లక్ష్మి పేరును ఖరారు చేశారు. మిగతా స్థానాల్లో పేర్లను తర్వాత ఖరారు చేయనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలు గెలవబోతున్నామని కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. రెవెన్యూ, మున్సిపల్‌ శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరాన్ని సీఎం నేతలకు వివరించినట్టు తెలుస్తోంది. రెవెన్యూ చట్టంలో సమూల మార్పులు తప్పవని సీఎం అన్నారు.